నేల విడిచినా జనం మరువని నేత
ఆ గుమ్మం రెండున్నర దశాబ్దాలు గా ఆపద లో ఉన్నవారికి ఒక భరోసా . ఏ అవసరం వచ్చినా ఎంతటి కష్టం వచ్చినా ముందు గా గుర్తుకు వచ్చే ఒకే ఒక్క ధైర్యం ఆ మనిషి అండగా వచ్చి నిలబడతారు అనే నమ్మకం. ఆ నమ్మకానికి కారణం ఎవరు ఏ సమయం లో పిలిచినా అర్తదరాత్రి అయినా అపరాత్రి అయినా తన సొంత కుటుంబాన్ని సయితం వంటరి గా వదిలి ఆపదలో ఉన్నవారిని ఆడుకోవటానికి వెళ్ళటం.
1980 చివర్లో ఆయన పిల్లలు చాలా చిన్నవారు అయినప్పటికీ ఎలాంటి సమయం లో అయినా ఆయన గురించి కానీ , ఆయన కుటుంబం గురించి కానీ ఆలోచించుకోకుండా ఎంత రిస్క్ అయినా ప్రజలకోడం అర్ధరాత్రుళ్లు వెళ్లేవారు.
ఎందరో రాజకీయ నాయకులలో గుర్తుండే రాజకీయ నాయకులు కొందరే, ఆ కొందరి లో ఎప్పటికీ గుర్తుండే నాయకుడు స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన రావు గారు. గెలుపోటముల తో సంబంధము లేకుండా నిరంతరం ప్రజలతో మమేకమయిన ఒకే ఒక్క డాషింగ్ లీడర్.
ఇప్పటికి ఆయన పేరు వింటే గుర్తుకు వచ్చేది మా రామ్మోహనరావు అనే మాట.
ఆయన చేసిన అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పై పోరాటాలలో కొన్ని :
- రాజానగరం కి నన్నయ్య విశ్వ విద్యాలయం: రాజానగరం కి నన్నయ్య విశ్వ విద్యాలయం తీసుకు వచ్చిన ఘనత శ్రీ రామ్మోహన రావు గారిది. ఆయన మంత్రివర్యులు గా ఉన్నపుడు పట్టుబట్టి మరీ నన్నయ్య విశ్వవిద్యాలయం తీసుకువచ్చారు.
- గోదావరి నది పై రెండో వంతెన : రాజముండ్రి గోదావరి నది పై రెండో బ్రిడ్జి తీసుకొచ్చిన ఘనత కూడా జక్కంపూడి రామ్మోహనరావు గారిదే.
- కడియం నర్సరీ రైతులకు ఉచిత విద్యుత్ :జక్కంపూడి రామోహన రావు గారు మంత్రివర్యులు గా ఉండగా కడియం నర్సరీ రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చేలా కృషి చేసారు.
నష్టపోయింది ఆయన కుటుంబమే :
పోరాడే నాయకుడికే ఎక్కువ నష్టం జరిగేది అనేది ఆయన విషయం లో చూడవచ్చు, ఆయన చేసిన ప్రతి పోరాటం పేదల కోసం, నష్టపోయిన వారికి న్యాయం చేయటం కోసం అయితే రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ఆ పోరాటతత్వాని ఆయనపై బురద చల్లటానికి వాడుకున్న్నారు.
కడియం రైతుల కోసం నీరు విధుల చేయించటానికి వెళ్లిన గొడవలో ఒకసారి సెంట్రల్ జైలు కి వెళ్లారు, ఇలా ఎన్ని కష్టాలు ఎదురయినా, తానూ వ్యక్తిగత, కుటుంబ సమయాన్ని ఎంత నష్టపొయినా కూడా ప్రజాపోరాటం మాత్రం ఆపలేదు.
నేడు ఆయన కుటుంబం:
మారిన రాజకీయ సమీకరణలలో ఆయన కుటుంబం 2014 నుంచి రాజానగరం నియోజకవర్గం లో పోటీ చేస్తూ వస్తుంది. 2009 లో PRP , 2014 లో కొత్త రాష్టం, పవన్ కళ్యాణ్ ప్రభావం తో ఓటమి చూసినా కూడా, ఒక్క రోజు కూడా నియోజికవర్గాన్ని వదలకుండా అనేక ప్రజా పోరాటాలు చేస్తూ ప్రజలకి వెన్ను దన్ను గా నిలిచారు.
జక్కంపూడి రాజా, తన తండ్రి తండ్రి లాగే అందరి అభిమానం చూరగొని 10 సంవత్సరాలు గా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రాజానగరం లో ప్రజలు మా రాజా అని సొంత ఇంటి మనిషి లా పిలుచుకుంటారు.
అక్రమ ఇసుక, ఇసుక లారీల విచ్చల విడి రవాణాల పై పోరాటం :
రాజానగరం నియోజకవర్గం లో విచ్చల విడిగా సాగుతున్న అక్రమ ఇసుక మాఫియా పై అలుపెరుగని పోరాటం చేసారు జక్కంపూడి రాజా మరియు జక్కంపూడి విజయలక్ష్మి గారు.
రాజానగరం నియోజకవర్గం లో సామాన్య ప్రజలకి, స్కూల్ పిల్లలకి మృత్యు శకటాలు గా మారిన అక్రమ ఇసుక రవాణా లారీ లని అరికట్టటానికి అలుపెరగని పోరాటం చేసారు.
రాజానగరం లో ప్రధాన సమస్య అయిన ఇసుక అక్రమ రవాణా చేసే లారీల కింద పడి చనిపోయిన మామిడి దుర్గ సంఘటన లో 24 గంటల పాటు రోడ్డు పైనే భైఠాయించి బాలిక కుటుంబ సభ్యుల కోసం పోరాటం చేయటమే కాకుండా, అక్రమ ఇసుక లారీలు ప్రజల్ని బలికొంటున్న విషయాన్నీ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి పోరాటం చేసారు.
రైతులకోసం:
మెట్ట ప్రాంతం అయినా రాజానగరం రైతుల కోసం జక్కంపూడి రాజా అనేక ఉద్యమాలు చేసారు .
విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ కోసం :
విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ విష్యం లో ప్రభుత్వ నిర్లక్ష్యం పై నిరాహారదీక్ష చేసారు జక్కంపూడి రాజా.
విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ విష్యం లో ప్రభుత్వ నిర్లక్ష్యం పై నిరాహారదీక్ష చేసారు జక్కంపూడి రాజా.
రాజకీయ పార్టీలకతీతం గా యువత నుంచి అభిమానం:
యువత లో జక్కంపూడి రాజా విశేష అభిమానం చూరగొన్నారు. ఏ పార్టీ వారు అయినా రాజా విషయం లో మా రాజా అని పిలుచుకుంటారు.
యువత లో జక్కంపూడి రాజా విశేష అభిమానం చూరగొన్నారు. ఏ పార్టీ వారు అయినా రాజా విషయం లో మా రాజా అని పిలుచుకుంటారు.
Jai Jakkampudi
ReplyDeleteJai Jakkampudi
ReplyDelete