నేల విడిచినా జనం మరువని నేత

నేల విడిచినా జనం మరువని నేత ఆ గుమ్మం రెండున్నర దశాబ్దాలు గా ఆపద లో ఉన్నవారికి ఒక భరోసా . ఏ అవసరం వచ్చినా ఎంతటి కష్టం వచ్చినా ముందు గా గుర్తుకు వచ్చే ఒకే ఒక్క ధైర్యం ఆ మనిషి అండగా వచ్చి నిలబడతారు అనే నమ్మకం. ఆ నమ్మకానికి కారణం ఎవరు ఏ సమయం లో పిలిచినా అర్తదరాత్రి అయినా అపరాత్రి అయినా తన సొంత కుటుంబాన్ని సయితం వంటరి గా వదిలి ఆపదలో ఉన్నవారిని ఆడుకోవటానికి వెళ్ళటం. 1980 చివర్లో ఆయన పిల్లలు చాలా చిన్నవారు అయినప్పటికీ ఎలాంటి సమయం లో అయినా ఆయన గురించి కానీ , ఆయన కుటుంబం గురించి కానీ ఆలోచించుకోకుండా ఎంత రిస్క్ అయినా ప్రజలకోడం అర్ధరాత్రుళ్లు వెళ్లేవారు. ఎందరో రాజకీయ నాయకులలో గుర్తుండే రాజకీయ నాయకులు కొందరే, ఆ కొందరి లో ఎప్పటికీ గుర్తుండే నాయకుడు స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన రావు గారు. గెలుపోటముల తో సంబంధము లేకుండా నిరంతరం ప్రజలతో మమేకమయిన ఒకే ఒక్క డాషింగ్ లీడర్. ఇప్పటికి ఆయన పేరు వింటే గుర్తుకు వచ్చేది మా రామ్మోహనరావు అనే మాట. ఆయన చేసిన అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పై పోరాట...